Ap Cabinet Meeting: పలు నిర్ణయాలపై మంత్రివర్గం చర్చ..! 3 d ago
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయం తీసుకోనున్నారు. పాలనాపరమైన అనుమతులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మున్సిపాలిటీల చట్టం -1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో చట్ట సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. జలజీవన్ మిషన్‌లో కొత్త టెండర్లను పిలిచే అంశంపై సమీక్షించనున్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చట్ట సవరణ డ్రాఫ్ట్ బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం వివిధ ప్యాకేజీ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వరద ముంపు బాధితులకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రుణాల రీషెడ్యూల్ నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల వరద ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్‌పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.